ENDLESS HAPPINESS...LIFE LONG...ENJOY EACH DAY, EVERY DAY THROUGHTOUT LIFE..!!

నిన్న బాబా తో మాట్లాడినపుడు, మాటల్లో నాకే  నిజ జీవితం లో నిత్య జీవితం లో "అద్వైత సాధన " నాకు చాల చక్కగా అర్ధం అయ్యింది.  నిజంగా శక్తి స్వరూపానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 

మాట్లాడినపుడు ఉదాహరణను చెప్పినపుడు ఏది ముఖ్యమో అదే ద్వైతం లేకుండా చేస్తే అదే అద్వైత సాధన. 

ఈ రోజు ఆయనను కలవడానినికి వెళుతున్నప్పుడు పుస్తకం వ్రాయాలని అది ప్రతివారం బ్లాగు లో అప్డేట్ చేయాలని  నిర్ణయించు కున్నాను. ఆ పుస్తకం పేరుతొ బ్లాగ్ మైంటైన్ చేయాలని, నా ట్రేడ్స్ రిజల్ట్స్ తో పాటుగా స్క్రిప్ట్ రోజూ వ్రాయాలని అది వారాంతరం లో అప్డేట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాను. 

సో నో ఛీటింగ్, నో కంప్రమైస్ 

A LIFE LONG MANTRA TO BE HAPPY: 

NO CHEATING, NO COMPROMISE AT ANY COST. 

=======================నిన్న వ్రాసిన శక్తి స్వరూప సాధన .... ================


Tuesday, December 03, 2019

"అ"రూపం, "ఆ"రూపం "ఈ"రూపం, "ఏ"రూపం అయినా......

"అ"రూపం, "ఆ"రూపం "ఈ"రూపం, "ఏ"రూపం అయినా నీ అపురూపమే...........  యోగి కైయిన భోగి కైయిన...




నీ అరూపం జననం తో ఓ రూపం, జననం లో దాగి ఉన్న జీవ శక్తివి నువ్వు 

రూపం మరణం తో అరూపం గా మాయం, మరణం లో దాగి ఉన్న నిర్జీవం నువ్వు

జననం మరణం ల మధ్య ఉన్న జీవనానురాగ జీవితం నువ్వు ... 

శక్తివి నువ్వు, అశక్తివి నువ్వు, ఆశక్తివి నువ్వు, నిరాశక్తివి నువ్వు, అన్నీ నువ్వే 

అంతా నువ్వే అయినా  నువ్వెవరని, ఎక్కడని వెదికే ప్రయత్నం మాది  !!


మా శ్వాస కోసం గాలి రూపం లో ఉన్న వాయు స్వరూపానివి నువ్వు,

కంటి కోసం కాంతిరూపం లో ఉన్న జ్యోతిస్వరూపానివి నువ్వే,

చెవి కోసం ఉన్న శబ్దరూపం లో ఉన్న నాదస్వరూపానివి నువ్వు,

చర్మం కోసం స్పర్శ రూపం లో ఉన్న అనుభూతి రూపానివి నువ్వే,

నోటి కోసం రుచి రూపంలో, ఆకలి కోసం ఉన్న అన్నం పరబ్రహ్మం నువ్వు,

సర్వేంద్రియాల సుఖాల కోసం ఉన్న ఆనందస్వరూప అపురూపనివి నువ్వు!!. 


అన్ని ఇంద్రియాలు ఉన్నా, నీవిన్ని రూపాలలోఉన్న, నిను గుర్తెరగని జీవశవాన్ని నేను,

సృష్టి లోని అన్ని రూపాలలో ఏ రుపేంద్రియాలు లేక, నాలోనే ఉన్న, నాతోనే ఉన్న 

నీ నన్ను గా నడిపిస్తూ, నను నన్నుగా జీవింపజేస్తున్న పరిపూర్ణ పరమాత్మవు నువ్వు!!

అందుకే అందుకో వందనాలు నేనిస్తున్నా మా అందరి తరపునా ..... !!!



Comments

Popular posts from this blog

The symmetry and possibility….